
ఐపీఎల్ 2025లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసినట్టే కనిపిస్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు లేవు. ఈ సీజన్ లో అత్యంత ఘోరంగా ఆడిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. తొలి మ్యాచ్ లో సొంతగడ్డపై గెలిచి గ్రాండ్ గా సీజన్ ను ఆరంభించినా ఆ తర్వాత వరుస పరాజయాలు ఆ జట్టును కృంగదీశాయి. దీనికి తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం వారికి అతి పెద్ద మైనస్. గైక్వాడ్ లేకపోవడంతో చెన్నై ప్రస్తుతం ధోనీ నడుస్తున్నాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 8 మ్యాచ్ ల్లో ఆడితే రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఒక జట్టు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు సాధించాలంటే 8 మ్యాచ్ ల్లో విజయం తప్పనిసరి. 7 మ్యాచ్ లు గెలిచినా వెళ్లాలంటే అదృష్టం కలిసి రావాలి. చెన్నై ఈ సీజన్ లో మరో 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్ ల్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టోర్నీ నుంచి 99 శాతం నిష్క్రమిస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 20) ముంబై ఇండియన్స్ తో ఓడిపోయిన తర్వాత చెన్నైకి ఈ పరిస్థితి వచ్చింది.
ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. మ్యాచ్ తర్వాత ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. " మొదట మా లక్ష్య ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు ప్రయత్నించడం. ఒకవేళ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోతే.. వచ్చే సీజన్ కు మంచి ప్లేయింగ్ 11 తయారు చేయడం మీద దృష్టి పెడతాం". అని ధోనీ అన్నాడు. ధోనీ మాటలను బట్టి చూస్తే ఈ సీజన్ లో చెన్నై యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలను ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆయుష్ మాత్రే, షేక్ రషీద్ ఆడిన తొలి మ్యాచ్ లో రాణించారు. వీరి మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ప్లేయర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చు.
Also Read : ఆ ఒక్కడికే అన్యాయం: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన ఐదుగురు క్రికెటర్లు వీరే!
వాంఖడే వేదికగా ఆదివారం (ఏప్రిల్ 20) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. భారీ ఛేజింగ్ లో స్టార్ బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 68: 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ(45 బంతుల్లో 76: 6 సిక్సర్లు, 4 ఫోర్లు) చెలరేగడంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది.
Dhoni is looking to the future if they don't make the playoffs 🗣️ pic.twitter.com/UUCwOKyRe7
— ESPNcricinfo (@ESPNcricinfo) April 20, 2025