MS Dhoni: బ్యాడ్మింటన్ కోర్ట్‌లో దుమ్ము లేపిన ధోనీ.. ఒలింపిక్స్‌కు పంపాలంటూ నెటిజన్స్ డిమాండ్

MS Dhoni: బ్యాడ్మింటన్ కోర్ట్‌లో దుమ్ము లేపిన ధోనీ.. ఒలింపిక్స్‌కు పంపాలంటూ నెటిజన్స్ డిమాండ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అతని వయసు జస్ట్ నెంబర్ మాత్రమే. వయసు పెరుగుతున్నా ఫిట్ నెస్ లో మాత్రం తనకు తానే సాటి. 43 ఏళ్ళ ధోనీ క్రికెట్ లోనే కాదు బ్యాడ్మింటన్ కోర్ట్ లోనూ ఇరగదీస్తున్నాడు. అదిరిపోయే సర్వ్ చేస్తూ.. పవర్ ఫుల్ స్మాష్ లు కొడుతున్నాడు. తాజాగా అతను బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ధోనీ ఆటను చూసిన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 

వైరల్ అవుతున్న వీడియోలో ధోనీ జంప్ చేసి స్మాష్ కొట్టిన తీరుకు ఆశ్చర్యం కలగక మానదు. దీంతో మాహీ ఫ్యాన్స్ అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మా ధోనీ అన్ని క్రీడలు ఆడగలడు అని కొందరు అంటుంటే.. ఇప్పటికీ అతను కుర్రాడిలా కనిపిస్తున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ధోనీని 2028 ఒలింపిక్స్ కు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు దాటినా ధోనీ క్రేజ్ అసలు తగ్గలేదు. 

ఐపీఎల్ 2025 విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ ఆడతాడా లేదా అనే విషయంపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.   బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరగనున్న సమావేశం ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. బీసీసీఐ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే మహేంద్రుడు 2025 ఐపీఎల్ ఆడతాడు. అలా కాకుండా ఎప్పటిలాగే నలుగురిని మాత్రమే తీసుకునే రూల్ కొనసాగితే ధోనీ 2025 ఐపీఎల్ ఆడకపోవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి.