అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించిన ధోని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. భారత క్రికెట్‌కు ధోని చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు ఆయన అభిమానులతో సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలుపుతున్నారు. ధోని తన రిటైర్మెంట్ గురించి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై ధోని భార్య సాక్షి హృదయపూర్వకంగా స్పందించారు.
‘మీరు సాధించిన దాని గురించి మీరు గర్వపడాలి. మీరు ఆటకోసం ఎంతచేయగలరో అంత చేసినందుకు మీకు అభినందనలు. మీ విజయాల గురించి నేను గర్వపడుతున్నాను. మీరు క్రికెట్ కు వీడ్కోలు చెప్పినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఈ సమయంలో నేను మీకు సపోర్ట్ గా ఉంటాను. ముందుముందు మంచి ఆరోగ్యం, ఆనందం మరియు గొప్ప విషయాలు కలగాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పినదాన్ని ప్రజలు మరచిపోతారు. మీరు చేసినదాన్ని ప్రజలు మరచిపోతారు. కానీ, మీరు మీ ఆట ద్వారా వారికి ఎలా సంతోషాన్ని ఇచ్చారో దాన్నిఎప్పటికీ మర్చిపోలేరు’అని సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ధోని 2014లోనే టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా శనివారం వన్డేలు మరియు టీ20 ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత మాజీ కెప్టెన్ ధోని 350 వన్డే ఇంటర్నేషనల్స్, 98 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. ఆయన పేరు మీద 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి. అలాగే 98 టీ20 మ్యాచులు ఆడిన ధోని.. రెండు అర్ధ సెంచరీలతో పాటు 37.60 సగటు రన్ రేటుతో 1,617 పరుగులు చేశాడు.
For More News..