టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన మాజీ బిజినెస్ పార్టనర్ మిహిర్ దివాకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశాడు. దీంతో పోలీసుల అతన్ని అరెస్ట్ చేశారు. మహిర్ దివాకర్ జైపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీని స్థాపించడానికి తన పేరును ఉపయోగించి తనను మోసం చేశాడంటూ ధోనీ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో దివాకర్‌పై జైపూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 406, 420, 467, 468, 471, 120B కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జైపూర్‌లో క్రికెడ్ అకాడమీ స్థాపనలో మిహిర్ అనధికారికంగా ధోనీ పేరును వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎంఎస్ ధోనీ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలకు కూడా దివాకర్ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 15 కోట్ల మేర అతను ఫ్రాడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. తనకు చెప్పకుండానే దివాకర్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు ధోనీ ఫిర్యాదు చేశాడు.