
చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. గత రెండేళ్లుగా ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ ధోనీ మాత్రం తన రిటైర్మెంట్ పై వార్తలు కొట్టిపారేస్తూ ఐపీఎల్ లో ఫ్యాన్స్ కోసం కొనసాగుతానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు ఓకే కొత్త టెన్షన్ పట్టుకుంది. శనివారం (ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్ చూడడానికి ధోని తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవికా దేవి వచ్చారు. వారితో పాటు స్టాండ్స్‌లో ధోని భార్య సాక్షి, కుమార్తె జివా కూడా ఉన్నారు. ధోనీ తల్లి దండ్రులు తొలిసారి చెపాక్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తుండడం విశేషం. మాహీ పేరెంట్స్ రావడంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ధోనీకి ఫేవరేట్ గ్రౌండ్ చెపాక్ లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చెన్నై హెడ్ కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ ధోనీ 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read:-సూపర్ కింగ్స్‌పై రాహుల్ మాస్టర్ క్లాస్.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 77:6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అభిషేక్ పోరెల్ (33), సమీర్ రిజ్వి (21), స్టబ్స్ (24), అక్షర్ పటేల్ (22) తలో చేయి వేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసింది.
MS Dhoni's complete family attending today's match 👀#MSDhoni #CSKvsDC pic.twitter.com/Wn8STnIH50
— Sheeth 🔻 (@iTheBeliver) April 5, 2025