దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను ధోనీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ రోహిత్ సారధ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించింది. శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ.. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విజయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు.
"టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్స్ కు శుభాకాంక్షలు. మ్యాచ్ చూస్తున్న సమయంలో నా హార్ట్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా ఉంటూ జట్టుకు విజయాన్ని అందించారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచిన యాజమాన్యం కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. ఈ విజయంతో దేశమంతా గర్వించేలా చేశారు. కంగ్రాట్స్ బాయ్స్.. నా పుట్టిన రోజుకు వెల కట్టలేని బహుమతిని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధోనీ పోస్టు చేశాడు". ఈ పోస్టుకు చక్‌దే ఇండియా పాటను జోడించాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (76) బ్యాట్‌తో మెరిపించగా.. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/20), జస్‌ప్రీత్ బుమ్రా (2/18), అర్ష్‌దీప్ సింగ్ (2/20) సత్తా చాటారు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. క్లాసెన్ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) టాప్ స్కోరర్. డికాక్ (39) రాణించాడు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.
MS Dhoni has a special message for the #T20WorldCup-winning #TeamIndia! ☺️ 🏆#SAvIND | @msdhoni pic.twitter.com/SMpemCdF4Q
— BCCI (@BCCI) June 29, 2024