వైజాగ్ వేదికగా ఆదివారం (మార్చి 31) జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయిది. ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సూపర్ కింగ్స్ ఏ దశలోనూ విజయం దిశగా వెళ్ళలేదు. ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయినా ధోనీ మాత్రం తనదైన ఫినిషింగ్ ఇచ్చాడు. మొదటి బంతికే ఫోర్ తో ఖాతా తెరిచిన మహేంద్రుడు.. మొత్తం 16 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 37 పరుగులుచేసి అజేయంగా నిలిచాడు. వయసు పెరుగుతున్న ధోనీలోని బ్యాటింగ్ పవర్ మాతరం తగ్గలేదు. తన ఇన్నింగ్స్ తో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ధోనీని అతని భార్య సాక్షి సింగ్ సరదాగా ట్రోల్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి తర్వాత..ధోనీకి ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ (231.50) అందరి కంటే ధోనీదే ఎక్కువ ఉండడంతో ఈ అవార్డు వరించింది. ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సాక్షి సింగ్ మ్యాచ్ ఓడిపోయామనే సంగతి ధోనీలో కనిపించడం లేదన్నట్లుగా అతడిని ఒక క్యాప్షన్ రాసి అతడిని సరదాగా ట్రోల్ చేసినట్లు అర్ధమవుతుంది. ఈ పోస్ట్ లో పైన ఐపీఎల్ తో కంబ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: టీమిండియాలోకి రీ ఎంట్రీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న ఖలీల్ అహ్మద్
ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయాలను సాధించినా.. ఫ్యాన్స్ ధోనీ బ్యాటింగ్ చూడలేకేపోయారు. దీంతో ఓ వైపు చెన్నై విజయాలు సాధిస్తున్నా.. ధోనీ బ్యాటింగ్ చూడలేకపోయామనే వెలితి ఫ్యాన్స్ లో అలాగే ఉంది. అయితే నిన్న ధోనీ బ్యాటింగ్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై ఓడిపోతుందనే బాధను కూడా ఫ్యాన్స్ మర్చిపోయారు. ఓ వైపు మాహీ బౌండరీల వర్షం కురిపిస్తుంటే గెలుపోటములు మాకు సంబంధమే లేదన్నట్లుగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం విశేషం.
Instagram story of Sakshi dhoni ❤️ also mentioned Rishabh pant 🔥 #CSKvsDC #Dhoni #Thala #ChennaiSuperKings pic.twitter.com/NfttZ98jBT
— Shubham Singh (@Shubham46346585) April 1, 2024