గోదావరిఖని, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు విధివిధానాలు రూపొందించే పని జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, జనరల్ సెక్రటరీ శ్యామ్‌సుందర్, ట్రెజరర్ శ్యామ్‌కుమార్, సీనియర్ జర్నలిస్ట్‌లు ఎం.వంశీ, నారాయణ, మారుతి, దయానంద్ గాంధీ, లక్ష్మణ్, ఎం.మాధవరావు, సత్యనారాయణ, శ్యామ్, విజయ్‌కుమార్, శేఖర్, డి.సాంబమూర్తి, రవీందర్, మనోహర్ రెడ్డి, రాంశంకర్ పాల్గొన్నారు.