గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్.. గోదావరిఖనిలో ఓసీపీలను ఏర్పాటు చేయించి రామగుండంను బొందల గడ్డగా మార్చారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ మంగళవారం గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో వాకర్స్‌తో, పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలతో, గోదావరిఖనిలో అడ్వకేట్లతో, కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్‌లో రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం రామగుండం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో లాయర్లు జవ్వాజి శ్రీనివాస్, దేశెట్టి అంజయ్య, బాస అనురాధ, వేల్పుల అరణ్ కుమార్, పద్మజ, శ్రీనివాస్, సలాం, మహమ్మద్ ఉమర్, ప్రశాంత్, సంపత్, నాగరాజు, ఆసిఫ్, 30 మంది అడ్వకేట్లు కాంగ్రెస్‌లో చేరారు.
బీజేపీకి ఓటేస్తే ఉపాధి పనిని తీసెస్తరు
ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే ఉపాధి హామీ స్కీమ్‌ను తొలగిస్తారని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్ అన్నారు. మంగళవారం రామగుండం బల్దియా పరిధిలోని 7వ డివిజన్లో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు.