హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ఎంఎస్ఎన్ రియల్టీ దాదాపు 20 మిలియన్ చదరపు అడుగుల్లో నివాస, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.
రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌లోని నియోపోలిస్, మంచిరేవుల, తెల్లాపూర్, పటాన్‌చెరు, ఇస్నాపూర్ వంటి చోట్ల ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటిలో ప్రీమియం అపార్ట్‌మెంట్లు, వాణిజ్య స్థలాలు ఉంటాయని ఎంఎస్ఎన్ గ్రూప్ ఫౌండర్ ఎంఎస్ఎన్ రెడ్డి అన్నారు.