హైదరాబాద్, వెలుగు: భారీ యంత్రాలను, పరికరాలను తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ. 226 కోట్ల ఆర్డర్లను సాధించింది. ఇవి క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాలకు చెందినవని తెలిపింది. బ్లూమ్ ఎనర్జీ నుంచి రూ. 191 కోట్ల విలువైన ఆర్డర్లు, రఫాయెల్, ఐఎంఐ సిస్టమ్స్, ఐఏఐ సంస్థల నుంచి రూ. 35 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.
ఈ ఆర్డర్లలో రూ. 225 కోట్ల పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తవుతాయని, మిగిలిన ఆర్డర్లను ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్డర్లతో తమ మార్కెట్షేరును మరింత పెంచుకుంటామని ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ పార్వత శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ విభాగాల్లో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.