పెద్దపల్లి జిల్లాను కాకా వెంకటస్వామి జిల్లాగా మార్చాలి : MTBF

నిజామాబాద్​ జిల్లా మోర్తాడ్​ మండల కేంద్రంలో  జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర స్వర్గీయ కాకా వెంకటస్వామి సంస్మరణ సభముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) అధ్వర్యంలో జరిగింది.  దళిత మేధావి కాకా వెంకటస్వామి  తెలంగాణకు చేసిన సేవలు చిరస్మరణీయమని   .. కాకాజీ వర్దంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ఎంటిబిఎఫ్ కన్వీనర్ సమ్రాట్ అశోక్ కొనియాడారు.  వెంకటస్వామి సేవలను గుర్తుండేలా పెద్దపల్లి జిల్లాను కాకా వెంకటస్వామి జిల్లాగా నామకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నిరు పేదలు చదువుకునేలా కాకా వెంకటస్వామి హయాంలో  కాకా తొమ్మిది కాలేజీలను డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరున స్థాపించి డొనేషన్స్ లేకుండా విద్య సేవలను అందించారన్నారు. కాకాజీ 1969లో తొలిదశ తెలంగాణ పోరాటంలో పోలీస్ కాల్పులకు బులెట్  గాయం తగిలి మరణం దగ్గరకి వెళ్లి తిరిగి వచ్చారని  ... ఆ రోజే తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిందని చరిత్ర చెబుతోందన్నారు.   మలి దశ ఉద్యమంలో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర వహించిన ఘనత వెంకటస్వామి దేనని అశోక్ పేర్కొన్నారు. కాకాజీ  వర్ధంతి కార్యక్రమంలో జర్నలిస్టులు  అంగులి మాలజీ, మామిడి రాజు తదితరులు  నివాళి అర్పించారు.