
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 2023-–2024 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం పీజీ కోర్సులో అడ్మిషన్స్ కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆగస్టు 13న పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.uceou.edu వెబ్సైట్లో సంప్రదించాలి.