టూల్స్​ & గాడ్జెట్స్ : చలిలో ట్రావెల్ చేసేవారి కోసం.. ఎలక్ట్రిక్​​ వాటర్​ బాటిల్​

టూల్స్​ & గాడ్జెట్స్ : చలిలో ట్రావెల్ చేసేవారి కోసం.. ఎలక్ట్రిక్​​ వాటర్​ బాటిల్​

అసలే చలి వణికించేస్తుంది. ఈ టైంలో ట్రావెల్​ చేస్తున్నప్పడు చల్లని నీళ్లు తాగాలంటే కాస్త కష్టమే. మరి ఎప్పటికప్పుడు వేడి చేసుకోవడం ఎలా? అంటే.. ఈ హాట్ వాటర్ కెటిల్ మగ్​ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. ఈ వాటర్​ బాటిల్​ని హాస్తిప్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది 0.4 లీటర్ స్టోరేజీతో పోర్టబుల్ సైజులో వస్తుంది. దీన్ని పవర్​ సాకెట్​కి కనెక్ట్‌‌ చేసి, బటన్​ నొక్కితే చాలు నీళ్లు వేడెక్కుతాయి. ఆ తర్వాత ఆటోమెటిక్​గా ఆఫ్ అయిపోతుంది. దీన్ని స్టెయిన్‌‌లెస్ స్టీల్​తో తయారుచేశారు.

ఇది 300 వాట్స్​ రాపిడ్ హీటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. అందువల్ల కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో నీళ్లు వేడెక్కుతాయి.  ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్‌‌ టెక్నాలజీ వల్ల ఆటోమేటిక్​గా పవర్ ఆఫ్ అవుతుంది. ముఖ్యంగా ఫార్ములా మిల్క్​ తాగే పిల్లలు ఉన్నవాళ్లకు ఇది బెస్ట్​ చాయిస్​.

గ్రీన్​ టీ లాంటివి తాగే అలవాటు ఉన్నవాళ్లు కూడా దీన్ని వెంట తీసుకెళ్లొచ్చు. లీకేజీ ఫ్రీ లిడ్​తో వస్తుంది.  దీన్ని 100 శాతం బీపీఏ ఫ్రీ మెటీరియల్​తో తయారుచేశారు.  

ధర : రూ. 1,250