- మెట్రో వేస్తం.. గొప్ప నగరంగా మారుస్తం
- 10 ఏండ్లు పాలించి.. 10 నెలలు పూర్తి కాని మాపై విమర్శలా?
- అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్
- సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్ –1 ఉద్యోగాలిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని, దీన్ని హైదరాబాద్‌కు నాలుగో సిటీగా తీర్చిదిద్దుతామ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతున్నదని, శంషాబాద్ నుంచి ఇక్కడకు మెట్రో సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్ పాల సీలు తీసుకొస్తామన్నారు.
బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి లేచి కౌంటర్ ఇచ్చారు. ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో యువతకు ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు. మాదాపూర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను ముచ్చర్లకు షిఫ్ట్ చేస్తామని, అక్కడే టూరిజం హబ్, శంషాబాద్ లో మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్యం అందుబా టులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వేల ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు. కానీ, తాము ఫార్మా విలేజ్ లు అంటున్నామని, అక్కడ వేల ఎకరాల్లో ఫార్మా కం పెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుంద ని, అందుకే స్కిల్ వర్సిటీ, ఫోర్త్ సిటీగా మారుస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఏఐని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచమంతా ఇప్పుడు ఏఐ హవా నడుస్తున్నదని అన్నారు. కేటీఆర్100 శాతం ఆర్టిఫిషియల్.. సున్నా శాతం ఇంటెలిజెన్స్ అని సీఎం సెటైర్ వేశారు.
కేటీఆర్ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నరు
కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని సభను తప్పుదోవ పట్టించడానికే వినియోగించుకోవాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఫైర్అయ్యారు. “పదేండ్ల పాలనలో మీ అనుభవాలు మీకున్నాయి. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.
పదేండ్లు పాలన చేసినవారు పది నెలలు పూర్తిచేసుకోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బతుకమ్మ చీరల స్కీమ్‌లో అవినీతి జరి గింది. నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు. చీరల డబ్బులు దాదాపు రూ.250 కోట్లు పెండింగ్ పెడితే మా ప్రభుత్వం రాగానే రిలీ జ్ చేశాం. చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు. సూరత్ నుంచి కిలోల చొప్పున తెచ్చి కమీషన్ కొట్టేశారు” అని సీఎం మండిపడ్డారు.
ఎయిర్పోర్ట్ వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. దాని వెనుకున్న ఆర్థిక కుట్ర ఏంటో అందరికీ తెలియాలన్నారు. “మేం మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగా మార్చుతామనలేదు. మూసీని తాగు నీటి సరస్సులాగా చేస్తం” అని రేవంత్ అన్నారు.
తాగుబోతుల అడ్డాగా హైదరాబాద్ స్టేడియమ్స్
ఏషియన్ గేమ్స్ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడి యమ్స్ తాగుబోతులకు అడ్డాగా మారాయని, ఇది చాలా బాధాకరమని సీఎం అన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వంద కోట్ల మంది సంబురపడే పరిస్థి తి ఉన్నదని తెలిపారు. ‘‘నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వలేదు. జరీన్‌కు, మహమ్మ ద్ సిరాజ్‌కు మేం గ్రూప్–1 ఉద్యోగం ఇస్తున్నాం. గురువారం కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం రేవంత్ వెల్లడించారు.
‘‘ఎన్నికలైపోయాయి.. ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి. అసెంబ్లీలో కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్‌వేసుకొని వచ్చా. మా మంత్రి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ స్టార్ట్ కావడానికి ముందే వచ్చి ఎదురు చూశారు. కానీ.. కేసీఆర్ మాత్రం సభకు రాలేదు” అని ఎద్దేవా చేశారు. మొదటి ప్రభుత్వం మహిళా మంత్రి లేకుండా నడిచిందని, ఇపుడు మైనార్టీ మంత్రి లేరంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చి సహకరించాలని సూచించారు. ప్రతిపక్ష నేత నుంచి తాను ఎంతో నేర్చుకోవాలని అనుకుంటే ఆయన అసెంబ్లీకే రావడంలేదని సీఎం రేవంత్ అన్నారు.