యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు

యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి యోగా అసోసియేషన్, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద 90 మంది యోగా సాధకులు మట్టి స్నానాలు చేశారు. ప్రకృతి చికిత్సలో మట్టి స్నానం ఒకటని వారు పేర్కొన్నారు. 

వనమూలికలు కలిపిన మట్టిని శరీరానికి పూసుకొని, సూర్య నమస్కారాలు చేసిన తర్వాత స్నానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని ప్రతినిధులు తెలిపారు. యోగా గురువు గడ్డం రాంరెడ్డి, ప్రతినిధులు పి. అంజయ్య, బి.రఘుకుమార్, డాక్టర్​ దేవయ్య, డాక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, లక్ష్మీపతి యాదవ్, నరేశ్,​ లింగారావు, వెంకటేశం, సిద్ధాగౌడ్, అనిల్​రెడ్డి పాల్గొన్నారు.