రుద్రవెల్లి వద్ద మూసీ ప్రవాహం​

యాదాద్రి, వెలుగు : పట్నంలో భారీ వాన పడడంతో మూసీ ప్రవాహం పెరిగింది. దీంతో యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం రుద్రవెల్లి వద్ద మూసీపై ఉన్న లో లెవల్​బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఆ రూట్లో ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బీబీనగర్​– భూదాన్​ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరిలో మంగళవారం భారీ వాన కురిసింది.

దీంతో శివారులోని మాసుకుంట వద్ద ప్రజలు చేపల వేటలో మునిగిపోయారు. యాదగిరిగుట్టలో అత్యధికంగా 168.6 మిల్లీ మీటర్లు, భువనగిరిలో 124.9 మిల్లీ మీటర్లు కురిసింది. రామన్నపేటలో అత్యల్పంగా 5.6 మిల్లీ మీటర్ల వాన కురిసింది.