కుంటాల, వెలుగు: ప్రతి ఇంటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ ముథోల్ అభ్యర్థి విఠల్ రెడ్డి అన్నారు. గురువారం కుంటాల మండలంలోని సూర్యాపూర్, ఓల, మెదన్పూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అంతకుముందు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు.
తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ గెలుపుకు బాటలు వేస్తాయన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మునుపెన్నడూ లేని విధంగా కుంటాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపూర్ మాజీ ఎంపీటీసీ పోశెట్టి బీఆర్ఎస్లో చేరారు. స్థానిక సర్పంచ్బక్కి సునీత, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, సొసైటీ చైర్మన్గజ్జారాం, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, పిప్పెర కృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు