గుండ్​గావ్​ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలి

గుండ్​గావ్​ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలి

భైంసా, వెలుగు : పల్సికర్​ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ ​వాటర్​తో ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురై నష్టపోతున్న గుండ్​గావ్​గ్రామస్తులకు నష్టపరిహారం అందించాలని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్​ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఇరిగేషన్, క్యాడ్​ ఈఎన్​సీని కలిసి విన్నవించారు. గ్రామస్తులు ఏటా వందల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని, గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వారికి సకాలంలో నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. అదే విధంగా కుంటాల, తానూర్​ మండలాల్లోని కాళేశ్వరం 27, 28 ప్యాకేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సాగుకు నీరందించాలన్నారు. ఆయన వెంట సిర్పూర్​ ఎమ్మెల్యే హరీశ్​బాబు, స్థానిక బీజేపీ లీడర్లు ఉన్నారు.