
- ఎస్సీ యువతిని పెండ్లి చేసుకున్నందుకు దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో ఘటన
రాయపర్తి, వెలుగు: ఎస్సీ వర్గానికి చెందిన యువతిని పెండ్లి చేసుకున్నందుకు గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొన వద్దని కుల పెద్దలు అడ్డుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన ముదిరాజ్కులానికి చెందిన భీమని నరేందర్.. కొద్ది నెలల కిందట వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలోని ఎస్సీ వర్గానికి చెందిన స్రవంతిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడు.
కాగా.. మంగళవారం కొత్తూరులో పెద్దమ్మ తల్లి పండగ నిర్వహిస్తుండగా ఆలయం వద్దకు దంపతులు వెళ్లారు. అక్కడ వీరిని గుడిలోకి రావొద్దని, పండుగలో పాల్గొనవద్దని ముదిరాజ్కులపెద్దలు అడ్డుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదుతో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్మానిటరింగ్కమిటీ నేతలు వెళ్లి మాట్లాడి గుడిలోకి ప్రవేశం, ఊరేగింపు యాత్రలో పాల్గొనేలా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి కుల వివక్షత పాటిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని కోరారు.