ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలె.. డీజీపీకి ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు ముదిరాజ్ సంఘం నేతలు. జూన్ 22న  హుజురాబాద్ లో ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు కౌశిక్ రెడ్డి. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం నేతలు డీజీపీ అంజనికుమార్ ను కోరారు. ముదిరాజ్ జాతిని అవమాన పరచిన కౌశిక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరామని ముదిరాజ్ సంఘం నేతలు తెలిపారు. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో తిట్టి అవమానించారని ఫైర్ అయ్యారు. గవర్నర్ కు కూడా కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తామన్నారు. తాము చేసిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు ముదిరాజ్ సంఘం నేతలు.

ALSO READ:తొందరపడి కాంగ్రెస్లో చేరకండి..వాళ్లంతా మళ్లీ వస్తారు..

పాడి కౌశిక్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ది చెపుతామని ముదిరాజ్ సంఘం నేతలు హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆయన్ని వదిలిపెట్టబోమని మండిపడ్డారు. గతంలో గవర్నర్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కాదని హితవు పలికారు ముదిరాజ్ సంఘం నేతలు.