ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే: ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్

ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే: ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే వెచ్చిస్తానని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ టివోలీ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కోకాపేటలో 5 ఎకరాల స్థలం ఉందని, అందులో ముదిరాజ్ భవన్ నిర్మిస్తామని పేర్కొన్నారు. 

పార్టీలకతీతంగా ముదిరాజ్ నాయకులంతా ఏకమై ముదిరాజ్​కులస్తులు ఆర్థికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం జర్నలిస్టు సంఘం నాయకులు ఆయనను సన్మానించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు బలరాం, అధ్యక్షుడు చింతల నీలకంఠం, ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీనివాస్ తదితరులున్నారు.