- పీసీసీ చీఫ్కు ముదిరాజ్ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ముదిరాజ్ నేతలు కోరారు. సోమవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను టీజేఎస్ నేత రమేశ్ ముదిరాజ్, పీసీసీ నేత లక్ష్మణ్ ముదిరాజ్, జగన్ మోహన్ ముదిరాజ్ కలిసి వినతిపత్రం అందజేశారు.
పీ ఎన్నికల సందర్భంగాముదిరాజ్లకు మంత్రి పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లు ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని కోరారు.రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లకు ఎమ్మెల్సీ లు, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
కార్యక్రమంలో నర్సింగ రావ్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, గణేశ్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా నాయకులు రమేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.