
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి వర్గంలో ముదిరాజ్‌లకు రెండుసార్లు స్థానం కల్పించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాజ్‌లకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ ముదిరాజ్మహాసభ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్‌లకు సీట్లు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామన్నారు. కొత్తగా చట్టసభలకు ఎన్నికైన వారిని సత్కరించేందుకు ఈ నెల 24న ఆదివారం ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ముదిరాజ్మేధో మదన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యువత పాల్గొవాలని కోరారు.