లక్ష్మణచాంద, వెలుగు: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు మాతర్ల హరీశ్ విజ్ఞప్తి చేశారు.
లక్ష్మణచాంద మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికైన సుంకరి సురేశ్, కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా నియామకమై వినేశ్‌ను మంగళవారం మండల కేంద్రంలో సన్మానించారు. ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు సుంకరి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.