ముదిరాజ్​ల డిమాండ్ల సాధనకు..జనవరి18 నుంచి బస్సు యాత్ర

పంజాగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి  స్పందించి ముదిరాజ్​సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు ఉప్పరి నారాయణ ముదిరాజ్, డాక్టర్​వై.శివకుమార్​ ముదిరాజ్, చెన్న రాములు ముదిరాజ్​డిమాండ్​ చేశారు. ఆదివారం వాళ్లు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్​లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ముదిరాజ్ కార్పొరేషన్​కు రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. ముదిరాజ్​ల డిమాండ్ల సాధనకు ఈ నెల 18 నుంచి ‘ముదిరాజ్​ప్రజా చైతన్య యాత్ర’ పేరుతో  గన్​పార్కు నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామన్నారు. తొలి విడత నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్​లో యాత్ర ఉంటుందన్నారు.