
పంజాగుట్ట, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంత అవకాశం ఇవ్వాలన్నారు. ముదిరాజ్ల హక్కుల సాధనలో భాగంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి15 నెలలు గడిచినా సీఎం రేవంత్‌రెడ్డి ముదిరాజ్‌లకు ఎటువంటి పదవులు ఇవ్వలేదన్నారు. తమసామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు, 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌చైర్మన్, బీసీ కమిషన్‌లో పోస్టులు ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికల్లో తమకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకుడు ఉప్పరి నారాయణ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్,శివ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.