చెన్నూరు, వెలుగు: తమకు భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ముదిరాజ్ కుటుంబాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ పట్టణ శివారులోని 1418 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని నిరుపేద ముదిరాజ్ కుటుంబాలు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయన్నారు.
అయితే కొంతమంది అక్రమంగా పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు. వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయిని మదుంయ్య, తుమ్మ రమేశ్, గడ్డం శంకర్, నాయిని బాలయ్య, బొజ్జ పోచం, నెన్నెల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.