
వైసిపి అధినేత వైఎస్.జగన్‌కు కాపు ఉద్యమ నేత .. సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వైసిపి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా నియమించినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం ( ఏప్రిల్ 13) లేఖ రాశారు.
ఆ లేఖలో.. తనపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. పేదలకు మీరే ఆక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు వైసీపీలో కీలక పదవి దక్కింది. వైయస్ జగన్... ముద్రగడ పద్మనాభం కు కీలక పదవి కట్టబెట్టారు. వైసీపీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరి కమిటీ (పీఏసీ) లో కీలక పదవిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ పదవి వైసిపి పార్టీలో అత్యంత ముఖ్యమైనది.
ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే... ముద్రగడ పద్మనాభం పై.... కూటమి నేతలు అనేక కుట్రలు చేశారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన ఇంటి దగ్గర టిడిపి పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కొందరు హల్చల్ చేశారని చర్చ కూడా జరిగింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పొలిటికల్అడ్వైజరీ కమిటీని 33 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో ముద్రగడ పద్మనాభానికి అవకాశం కల్పించారు వైఎస్ జగన్.