కాపు నేత ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన పేరు మార్చకుంటానని వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని అలా చేయకపోతే తాను పేరు మార్చుుకంటానని సవాల్ విసిరారు. అయితే నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ 70 వేలకు పైగా ఓట్లతో ఘనవిజయం సాధించారు.
ఈ క్రమంలో చేసిన శపథానికి కట్టుబడి ముద్రగడ తన పేరు మార్చుకుంటానని జూన్ 05వ తేదీన ప్రకటించారు. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నట్లుగా ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కోసం పత్రాలు కూడా రెడీ చేసుకున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణమంతా జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.