ఈ నెల 12న వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ..!

ఈ నెల 12న వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ..!

2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితా ప్రకటించగా పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. అన్ని పార్టీలకంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించి, వరుస బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల రేసులో ముందంజలో ఉంది అధికార వైసీపీ. సీట్ల కేటాయింపులో ఈసారి జగన్ అనూహ్యమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడను కలిసి ఎంపీ మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించాడని సమాచారం. కాగా, ముద్రగడను పవన్ కి పోటీగా పిఠాపురం నుండి పోటీకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలొచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోటీ చేసే అవకాశం ఉన్నా లేకున్నా వైసీపీలో చేరేందుకు ముద్రగడ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇటీవలే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరగా, మరో పక్క వంగవీటి రాధను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చుస్తే అటు ఉభయగోదావరి జిల్లాల్లో, ఇటు కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన కూటమికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.