కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు ముద్రగడ. ఈ మేరకు తాడేపల్లి వరకు ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు. తాజాగా ర్యాలీని రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. 14న పిలుపునిచ్చిన ర్యాలీని వాయిదా వేస్తున్నానని, 15లేదా 16న తానొక్కడే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో జనాలు వస్తే కూర్చోడానికి కాదు, నిల్చోడానికి కాదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. 15 లేదా 16న పార్టీలో చేరతానని తెలిపిన ఆయన ప్రజల అశీసులు కోరారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఖరారు కాకపోవటమే ఈ వాయిదాకు కారణమని తెలుస్తోంది.