ఇల్లెందు, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఇల్లెందు బరిలో టీడీపీ ఉంటుందని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇల్లెందు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆశవాహుల పేర్లను రాష్ట్ర పార్టీకి పంపించామని తెలిపారు. ఎవ్వరికి టికెట్వచ్చినా వారిని గెలిపించుకుంటామని చెప్పారు.
సమావేశంలో ఇల్లెందు పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పనూతల రాజేందర్ గౌడ్, శ్యామ్ తీవరి, అయ్యారి నాగరాజు, కొబ్బరి శివ, మోహన్ లోద్, రాంగోపాల్ లోద్, దేశవత్ శ్రీహరి టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ, వినీత్, శ్రీవేద్ పాల్గొన్నారు.