మహేష్ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముఫాసా .. డిసెంబర్ 20న విడుదల

హాలీవుడ్  సూపర్ హిట్ మూవీ ‘ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘ముఫాసా: ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వస్తోంది. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీనికి దర్శకుడు. డిసెంబర్ 20న ఈ చిత్రం ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.  హిందీలో ఈ చిత్రానికి షారుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్ చెబుతున్న విషయం తెలిసిందే. కాగా తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు వాయిస్ ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించారు.  

 ‘మహేష్ బాబు గారు ముఫాసా పాత్రకు వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి, జీవం పోయడం చాలా ఆనందంగా ఉంది’ అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ చెప్పారు. ‘లయన్ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పగా.. ఈ సారి కూడా వారే పాత్రలకు కొనసాగుతున్నారు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయబోతున్నారు.