NZ vs PAK: పాకిస్థాన్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టులో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ కొడుకు

NZ vs PAK: పాకిస్థాన్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టులో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ కొడుకు

న్యూజిలాండ్ టూర్ లో భాగంగా పాకిస్థాన్ ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ తర్వాత మార్చి 29 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ తో జరగనున్న మూడు వన్డే మ్యాచ్ లను సోమవారం (మార్చి 24) న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన ఈ జట్టులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అజార్ అబ్బాస్ కుమారుడు మహ్మద్ అర్స్లాన్ అబ్బాస్ చోటు దక్కించుకున్నాడు. అర్స్లాన్ అబ్బాస్ తొలిసారి కివీస్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. 

ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన అర్స్లాన్.. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన ఆధారంగా న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. అర్స్లాన్ అబ్బాస్ ఆల్ రౌండర్ గా సత్తా  చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని తండ్రి అజార్ అబ్బాస్ పాకిస్థాన్ తరపున 45 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత అజార్ అబ్బాస్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ అతను తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు, ఆక్లాండ్, వెల్లింగ్టన్ తరపున ఆడిన అజార్ అబ్బాస్.. ప్రస్తుతం ఫైర్‌బర్డ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు.

ALSO READ | GT vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. నలుగురు ఫారెన్ ఆల్ రౌండర్లతో పంజాబ్

ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే 13 మందితో కూడిన జట్టుకు టామ్ లేతమ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇండియాలో ఐపీఎల్ కమిట్ మెంట్ ల కారణంగా న్యూజిలాండ్ జట్టు తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అందుబాటులో ఉండడం లేదు. సాంట్నర్ తో పాటు రచీన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరం కానున్నారు. మార్చి 29న జరగనున్న ఈ సిరీస్ ఏప్రిల్ 5 తో ముగుస్తుంది.     

సిరీస్ షెడ్యూల్:

మొదటి వన్డే: మార్చి 29, మెక్లీన్ పార్క్, నేపియర్

రెండవ వన్డే: ఏప్రిల్ 02, మెక్లీన్ పార్క్, నేపియర్

3వ వన్డే: ఏప్రిల్ 05, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి