మొహరం వేడుకల్లో భాగంగా గట్టుపల, మర్రిగూడ మండలాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పీర్ల ఊరేగింపు జరిపారు. ముస్లిం పెద్దలు గ్రామస్తులతో కలిసి డప్పు చప్పులతో పీర్లను ఊరేగించారు. పీర్లకు నీళ్లు ఆరబోసి, కానుకలను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం పీర్ల పండుగ సంబురంగా జరిగింది.
కులాలకు అతీతంగా హిందూ, ముస్లింలు కలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. అనంతరం పీర్లను ఎత్తుకొని డప్పుచప్పులతో దూలా ఆడారు. వెలుగుపల్లి గ్రామానికి చెందిన పీర్ల నిర్వాహకులకు రూ.5వేలు విరాళంగా అందించారు.
– తుంగతుర్తి/గట్టుప్పల ( చండూరు), వెలుగు