ప్రాణత్యాగానికి ప్రతీక మొహర్రం

ప్రాణత్యాగానికి ప్రతీక మొహర్రం

ఓహో... జాంబియా, ఓలంపల్లి జాంబియా.  నాతోని మాట్లాడు  నాంపల్లి  జాంబియా.  ఒకటే పీరు తొలి మసీదు.  ఏమేమి కావాలె సామికి  నల్లగొండ మౌలాలికి’.. ఈ పాట వినగానే  గ్రామీణ ప్రాంతాల్లో పీర్లచావడిలో వెలసిన పీర్లు, నిప్పుల గుండం చుట్టూ మతాలకు అతీతంగా స్నేహపూర్వక సంబంధాలతో  చేసే అలయ్ బలయ్,  భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా నిర్వహించే  ‘మొహర్రం’ (పీర్ల పండుగ) ప్రార్థనలు గుర్తొస్తాయి. పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణాలో బతుకమ్మ పండుగ తర్వాత  గ్రామీణ ప్రాంతాల్లో  మొహర్రం పండుగకూ అంత ప్రాముఖ్యత ఉంది.  ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం పద్నాలుగో శతాబ్దం క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహర్రం.

ఈ పండుగను  తెలుగు ప్రాంతాల్లో  పీర్ల పండుగ అంటారు. షియా తెగవారు ఈ పండుగను పాటిస్తారు.  దైవప్రవక్త ముహమ్మద్​మనవళ్లు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని  జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.  పీరుల్ని పీర్ల చావడిలో ఉంచి నిప్పుల గుండం తొక్కుతూ తమ శరీరంపై  కొరడాలతో  కొట్టుకుంటూ తమ భక్తిని చాటుకుంటారు.  ఊదు అంటే సాంబ్రాణి పొగ.  పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. 

కులమతాలకు అతీతంగా.. 

తెలంగాణాలో 1830లో  నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను  ముస్లింలతోపాటు హిందువులు కూడా కులమతాలకు అతీతంగా స్నేహభావంతో జరుపుకుంటారు. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా) ఈ కేలండర్​ను వాడేవారు.   ఈ రోజు యౌమీ ఆషూరా.  

హమ్మద్  ప్రవక్త  మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ,  కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు.  మొహర్రం నెలను, ‘షహీద్’ (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ  పండుగలా కాకుండా  వర్ధంతిలా జరుపుకుంటారు. కర్బలా యుద్ధంలో మరణించినవారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ  మొహర్రం  పండుగను  పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు.  బీబీ కా అలావా నుంచి ప్రారంభమయ్యే  ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌‌ ‌‌  , గుల్జార్‌‌ ‌‌   హౌస్‌‌ ‌‌  , మీరాలం మండీ, దారుల్‌‌ ‌‌   షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌‌ ‌‌   ఘాట్‌‌ ‌‌   వద్ద ముగుస్తుంది. 

దర్గాల వద్ద ఉర్సు ఉత్సవాలు

ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చల కోసం ఇమామ్‌‌ ‌‌   హుసేన్‌‌ ‌‌   రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌‌ ‌‌  కు విషయం తెలిసింది. అతడు ఇమామ్‌‌ ‌‌   హుసేన్‌‌ ‌‌  ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్‌‌ ‌‌   పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌‌ ‌‌  ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. 

మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 72 మంది ఇమామ్‌‌ ‌‌   హుసేన్‌‌ ‌‌   వెంట ఉన్నారు. పది రోజులు పాటు యుద్ధం జరిగింది. ఇమామ్‌‌ ‌‌   హుసేన్‌‌ ‌‌   పరివారం స్వల్పంగా ఉన్నా ఎంతో ధైర్యంతో వీరోచితంగా పోరాడి అశువులు బాసింది.  పదో రోజు హుసేన్‌‌ ‌‌ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌‌ ‌‌కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్‌‌ ‌‌ హుసేన్​ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు. చివరి రోజు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దర్గాల దగ్గర ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 

- కేశపాగ శ్రీనివాస్,  సీనియర్​ జర్నలిస్ట్​