
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ నవంబర్ 1న ‘ముహురత్ ట్రేడింగ్’ ను నిర్వహించనున్నాయి. కొత్త సంవత్ 2081 ను ఆహ్వానించనున్నాయి. దీపావళి రోజు మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ, ఒక గంట పాటు ‘ముహురత్ ట్రేడింగ్’ ను ఎక్స్చేంజీలు నిర్వహిస్తుంటాయి. దీపావళి రోజు షేర్లు కొంటే మంచిదనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండడమే ఇందుకు కారణం. నవంబర్ 1 న సాయంత్రం 6 నుంచి 7 వరకు ముహురత్ ట్రేడింగ్ జరుగుతుంది. 15 నిమిషాల ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.