బర్త్​డే ముసుగులో ముజ్రా పార్టీ .. 8 మంది యువతులు, 13 మంది వ్యక్తులు అరెస్ట్

బర్త్​డే ముసుగులో ముజ్రా పార్టీ .. 8 మంది యువతులు, 13 మంది వ్యక్తులు అరెస్ట్
  • గంజాయి మత్తులో న్యూడ్ డ్యాన్స్​లు
  • మద్యం, గంజాయితోపాటు కండోమ్ ప్యాకెట్లు సీజ్

చేవెళ్ల, వెలుగు: బర్త్ డే పార్టీ ముసుగులో సిటీ శివారులో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మార్ సిటీ శివారులో తన బర్త్ డే వేడుకలు ప్లాన్​చేశాడు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎత్ బార్ పల్లిలోని హాలీడే హోం ఫామ్ హౌస్​కు​మంగళవారం సాయంత్రం వచ్చాడు. బర్త్ డే ముసుగులో ముజ్రా పార్టీని ఏర్పాటు చేసి, పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 8 మంది యువతులను రప్పించాడు. అనంతరం హైదరాబాద్ కు చెందిన తన12 మంది స్నేహితులను పిలిపించి పార్టీ ఇచ్చాడు. 

వీరందరికీ మద్యం, గంజాయి మత్తెక్కించి న్యూడ్ డ్యాన్స్​లు చేయించాడు. దీనిపై రాజేంద్రనగర్, ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో మొయినాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు. అప్పటికే గంజాయి మత్తులో తూగుతున్న యువతీయువకులను అరెస్ట్ చేసి, పీఎస్​కు తరలించారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లతోపాటు 70 గ్రాముల గంజాయి, 15 కండోమ్ ప్యాకెట్లు, రూ.18 వేల నగదు, ఆరు వాహనాలను సీజ్ చేశారు. వ్యాపారి మహ్మద్ లుక్మార్ తో ఫామ్ హౌస్ ఓనర్ అబ్దుల్ బీన్ పై కేసు నమోదు చేశారు. నిందితులను పీఎస్​కు తీసుకొచ్చిన తరువాత దర్యాప్తులో భాగంగా సీఐ పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ముజ్రా పార్టీ నిర్వహించిన తీరుపై పూర్తి వివరాలను ఆరా తీశారు.