హైదరాబాద్ శివారులో ముజ్రా పార్టీ భగ్నం: ఏడుగురు యువతుల అరెస్ట్.. భారీ మద్యం, గంజాయి స్వాధీనం

హైదరాబాద్ శివారులో ముజ్రా పార్టీ భగ్నం: ఏడుగురు యువతుల అరెస్ట్.. భారీ మద్యం, గంజాయి స్వాధీనం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా గంజాయి, హుక్కా, మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏతబర్ పల్లి గ్రామ పరిధిలోని హాలిడే ఫార్మ్ హౌస్‎లో బర్త్ డే పార్టీ పేరిట ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు.. బుధవారం (ఏప్రిల్ 9) తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు హాలిడే ఫార్మ్‎పై మెరుపు దాడులు నిర్వహించారు.

భారీగా హుక్కా, గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. యువతులతో అర్థ నగ్నంగా డ్యాన్సులు చేయించినట్లు సమాచారం. మెయినాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.