Prayagraj: మహాకుంభమేళాకు ముకేష్ అంబానీ కుటుంబం..

Prayagraj: మహాకుంభమేళాకు ముకేష్ అంబానీ కుటుంబం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులతో మహా కుంభమేళాను సందర్శించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్తానం ఆచరించారు. అంబానీ కుటుంబంలోని నాలుగు తరాలు కుంభమేళాను దర్శించడం విశేషం.

 ముకేష్ తల్లి కోకిలా బెన్, ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు అనంత్, ఆకాశ్ అంబానీ, ఆకాశ్ భార్య శ్లోకా మెహతా, వారి ఇద్దరి పిల్లలు పృథ్వీ, వేదా కలిసి నాలుగు తరాలు కుంభమేళా దర్శించారు. ముకేష్ అంబానీ, అతని ఇద్దరు కుమారులు ఆకాశ్, అనంత్ లు పవిత్ర స్నానం చేశారు. 

ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా, ఆయా రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా అంబానీ కుటుంబం  దర్శించుకోవడం విశేషం. మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికానుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.