జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..

ఇండియాలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ ప్రొవైడర్ జియో 5G నుంచి అప్ గ్రేడ్ అవుతూ.. అడ్వాన్స్డ్ జియో 5.5G నెట్వర్క్ ను లాంచ్ చేసింది. ఇంటర్నెట్ స్పీడ్ ను 10Gbps కు పెంచుతూ ఇప్పుడున్న 5G  యూజర్లకు అద్భుతమైన అప్ గ్రేడ్ ఆఫర్ ఇచ్చింది జియో. ఈ కొత్త నెట్ వర్క్ వలన సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సందుపాయం కల్పిస్తున్నట్లు జియో ప్రకటించింది. 

జియో 5.5G Network ఎలా పనిచేస్తుంది:

జియో 5.5G Network 5G కి అడ్వాన్స్డ్ వర్షన్. ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ ఆఫర్ చేస్తూ తక్కువ అంతరాయం ఉండి ఇప్పుడున్న 5G నెట్వర్క్ లత పోల్చితే చాలా విశ్వసనీయమైన సేవలు అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒకేసారి మూడు నెట్వర్క్ సెల్స్ (3CC component carrier)  ను వినియోగించి ఒకేసారి వివిధ టవర్ల నుంచి సిగ్నల్ అందుకోవడం, ఏ సిగ్నల్ బలంగా ఉంటే దాని నుంచి సూపర్ కనెక్టివిటీ ఇస్తుందట. దీని వలన యూజర్లు 10Gbps  స్పీడ్ తో డౌన్ లోడ్, 1Gbps తో అప్ లోడ్ సదుపాయం కలిగి ఉంటారు. 

OnePlus 13 సిరీస్ ఫోన్లకు ప్రత్యేకం:

జియో కొలాబరేషన్ తో  5.5G Network సపోర్ట్ చేస్తూ వన్ ప్లస్ 13 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసింది. జియో 5.5జీ నెట్ వర్క్ అడ్వాన్స్ టెక్నాలజీ పనిచేసే విధంగా కస్టమర్లకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా తయారు చేసింది వన్ ప్లస్ కంపెనీ. 3CC లేని ఫోన్లతో, 3CC డెవలప్ చేసిన వన్ ప్లస్ ఫోన్లను పోల్చి చూసినపుడు.. 3CC వన్ ప్లస్ ఫోన్ల డౌన్ లోడ్ 1,014.86 Mbps స్పీడ్ ఉండగా,  3CC లేని జియో నెట్వర్క్ డౌన్ లోడ్ కేవలం 277.78 Mbps మాత్రమే ఉందని కంపెనీ తెలిపింది. 

ALSO REAED | హైదరాబాద్​లోకి Redmi 14C వచ్చేసింది