ఇండియాలోనే తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కారు కొన్న అంబానీ.. ధర ఎంతంటే..

ఇండియాలోనే తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కారు కొన్న అంబానీ.. ధర ఎంతంటే..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన జియో గ్యారేజీలోకి మరో ఎక్ట్రార్డినరీ కారును చేర్చారు. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ కొనని రోల్స్ రాయిస్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనటం హాట్ టాపిక్ గా మారింది. భారత్ లో ఫస్ట్ రోల్స్ రాయిస్ కులినన్ బుల్లెట్ ప్రూఫ్ ( Rolls-Royce Cullinan) కారు కొని తన సెక్యూరిటీలోకి లక్జరీ బుల్లెట్ ప్రూఫ్ కారును యాడ్ చేసుకున్నారు. 

అంబానీ ఫ్యామిలీ జియో గ్యారేజ్ లో అత్యధికంగా ప్రైవేట్ కార్ల కలెక్షన్ ఉంటుందని ముంబైలో చర్చ. కానీ కచ్చితంగా కార్ల సంఖ్య ఎంతో ఎవరికీ తెలియదు. కానీ రోల్స్ రాయిస్ కులినన్ ఎస్యూవీ (Rolls-Royce Cullinan SUVs) కార్లు మాత్రం కనీసం 10 ఉంటాయని అంచనా. 

రీసెంట్ అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కులినన్ బుల్లెట్ ప్రూఫ్ ( Rolls-Royce Cullinan) కారు ధర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే  రోల్స్ రాయిస్ కులినన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7 కోట్ల 99 లక్షలు ఉంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ మాడిఫికేషన్స్ తో కలిపి రూ.13 కోట్ల పైనే అయ్యుంటుదని మీడియా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. సిల్వర్ కలర్ బుల్లెట్ ప్రూఫ్ కారును చండీగఢ్ లో మాడిఫై చేయించారు. బుల్లెట్ ప్రూఫ్, బాంబుల నుంచి తట్టుకునే టెక్నాలజీతో అంబానీ వంటి హై ప్రొఫైల్ బిజినెస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్ అని అంటున్నారు.