దేశంలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అంబానీ కుటుంబం గురించి తెలియని వారుండరు. అయితే ముఖేష్ అంబానీ ఏం చేసినా మాటలు కాదు నోట్లు మాట్లాడుతాయని చెప్పవచ్చు. ఇటీవలే ముఖేష్ అంబానీ తన తనయుడు అనంత్ అంబానీ దాదాపుగా రూ.5 వేల కోట్లు వెచ్చించి ఘనంగా వివాహం చేశారు. ఈ వివాహానికి దాదాపుగా ప్రపంచం నలుమూలల నుంచి సెలెబ్రెటీలు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
అయితే ఇటీవలే ముఖేష్ అంబానీ తన తనయుడు అనంత్ అంబానీ కోసం కొత్తకారు కొని గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా... అయితే ఈ కారు సాదాసీదా నార్మల్ కారు కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల ఉత్పత్తి సంస్థ రోల్స్ రాయిస్ కి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్. భారత్ లో ఈ కారు బేస్ మోడల్ ధర మాత్రమే దాదాపుగా రూ.10.50 కోట్లు ఉంది. టాప్ వేరియంట్ రూ.12.75 కోట్లు ఉంది. అయితే ముఖేష్ అంబానీ టాప్ వేరియంట్ కొని మరో రూ.10 కోట్లు వెచ్చించి మోడిఫికేషన్స్ చేయించారు.
ఇందులో ముఖ్యంగా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్స్ లో ఎక్స్ట్రా యాడాన్స్ తోపాటు బుల్లెట్‌ప్రూఫింగ్ ఫీచర్స్ కూడా కస్టమైజ్ చేయించారు. దీంతో మొత్తం కారు ధర దాదాపుగా రూ.25 కోట్లు పైగ ఉంది. అయితే ఇప్పటి వరకూ అంబానీ ఫ్యామిలీలో దాదాపుగా 12కి పైగా రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అలాగే ఫెరారీ, పోర్షే, మసారేటి తదితర ఖరీదైన కార్లు ఉన్నాయి.