
సిటీ లైఫ్ లో ఎవరైనా స్వచ్ఛమైన ఆవు లేదా గేదె పాలు తాగే పరిస్థితి ఉందా..? పల్లెటూర్లలో ఉండేవాళ్లకు ఆ అవకాశం ఉంది. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో ఉండే వారికి దాదాపు ప్యాకెట్ పాలే దిక్కు. ఎవరైనా షెడ్ నుంచి వచ్చే పాలు పోయించుకుంటున్నా వాటికి గ్యారెంటీ లేదు. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి పాల కంపెనీలు, బ్రాండ్స్ మారుతుంటాయి. అయితే సెలబ్రిటీలు కూడా మనం వాడే పాలు వాడతారా..? ఏ కంపెనీ మిల్క్ వాడుతుంటారు.. అయినా వాళ్లకేంతక్కువ.. స్వచ్ఛమైన పాలను ఇంటికి తెప్పించుకుంటారు.. అని అనుకుంటుంటారు ఎవరైనా వారిగురించి.
ముకేశ్ అంబానీ, సచిన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి సెలబ్రిటీలు ఏ పాలు వాడుతున్నారో తెలుసా. పుణెకు సమీపంలో ఉండే భాగ్యలక్ష్మీ డెయిరీ అనే కంపెనీ పాలు వినియోగిస్తారట. ఈ కంపెనీ పాలను ప్రైడ్ ఆఫ్ కౌవ్స్ (Pride of Cows) అని కూడా పిలుస్తారు. లీటర్ పాల ధర 90 రూపాయలు. దేశంలో ఇన్ని బ్రాండ్స్ ఉండగా ఎందుకు ఆ కంపెనీ పాలనే వాడుతున్నారు..? ఏంటి అందులో స్పెషాలిటీ..? అనే డౌట్ ఎవ్వరికైనా వస్తుంది కదా.
175 మందితో స్టార్ట్ చేసి..
ప్రైడ్ ఆఫ్ కవ్స్ అనే బ్రాండ్ ను ఓనర్ దేవేంద్ర షా మొదట్లో 175 మందితో ప్రారంభించాడు. ప్రస్తుతం 22 వేల మంది కస్టమర్లకు చేరుకుంది. ముంబై, పుణెతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో సెలబ్రిటీస్ తో పాటు ప్రముఖులు, బిజినెస్ మెన్, బడాబాడులు దాదాపు ఈ పాలనే వాడుతున్నారట.
ఈ డెయిరీ ప్రత్యేకత ఏమిటి?
ప్రైడ్ ఆప్ కౌవ్స్ డెయిరీ 26 ఎకరాల్లో ఉంటుందట. ఇందులో 2 వేల ఆవులు ఉంటాయి. ఒక్కొక్కటి 90 వేల నుంచి లక్ష రూపాయల ధర ఉండే డచ్ హోల్ స్టీన్ (Dutch Holstein) ఆవులు మాత్రమే ఈ డెయిరీలో ఉంటాయట. ఈ డెయిరీ ఫామ్ లో రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. క్వాలిటీ, హైజీనిక్ గా డెయిరీని మెయింటైన్ చేస్తారట.
ALSO READ | టైం ఫిక్స్..సునితావిలియమ్స్ భూమ్మీద ఎప్పుడు కాలుపెడుతుందంటే..
ఆవులకు మొక్కజొన్న, సోయాబీన్ దాణా, ఆల్ఫా గడ్డి, సీజనల్ గా వచ్చే కూరగాయలు పెడతారు. అలాగే కేవలం ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగిస్తారు. ప్రతిరోజు మూడు సార్లు ఆవులను, ఫామ్ ను క్లీన్ చేయటమే కాకుండా.. పాలు పిండే ముందు బరువు, టెంపరేచర్ కొలుస్తారట. ఆవులు స్ట్రెస్ ఫ్రీ గా ఉండేందుకు సాఫ్ట్ మ్యూజిక్ వినిపిస్తారట.
పాలు పిండేందుకు ఆటోమేటిక్ మెషీన్స్ ఉంటాయట.. మనుషుల చేతులు తగలకుండా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారట. పాలు పిండిన తర్వాత పైపుల ద్వారా మాత్రమే పాలను సేకరించి, పాయిశ్చరైజేషన్ చేస్తారట. అత్యంత వేగంగా ఉదయం 5.30 నుంచి 7.30 గంటల మధ్య డెలివరీ చేస్తారట. ఇంత హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టే సెలబ్రిటీలు, బడా బాబులు ఈ పాలకు ప్రయారిటీ ఇస్తున్నారు.