టెలికాం వ్యాపారం కోసం అదానీ గ్రూప్ తన పూర్తి స్థాయి ప్రణాళికను ఇంకా వెల్లడించ నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబా టులోకి తేవడానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో 5జీ సేవలను మొదలు పెట్టారు. భారతీయ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ 2022 సంవత్స రంలో 5జీ టెలికాం సేవల కోసం స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఏడీఎన్ఎస్) స్పెక్ట్రమ్ వేలంలో 20 సంవత్సరాల పాటు వాడుకోవడానికి రూ.212 కోట్ల విలువైన 26గిగాహెజ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో 400మెగాహెజ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునే హక్కును పొందింది. ఒకేవ్యాపారం కోసం ఈ రెండు గ్రూపులు పోటీపడటం ఇదే మొదటిసారి.