భారతీయ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు 1000 మంది అతిథుల మధ్య రూ.1000 కోట్లు ఖర్చుతో వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ వ్యాపార వేత్తలు, ఫేమస్ క్రీడాకారులు, సినీ నటులు, బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఈరోజు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ మాట్లాడాడు. ఆయన మాటలు ముఖేష్ అంబానీ హర్ట్ కు టచ్ అయి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు.వేదికపై అందరి ముందు అనంత్ అంబానీ తన అనారోగ్యం సమస్యల గురించి చెప్తున్నప్పుడు అంబానీ ఏడ్చాడు. సంతోషకరమైన సందర్భంలో వాటిని గుర్తు చేసుకున్న ముఖేష్ అంబానీ బాధతో కంటతడిని ఆపుకోలేక పోయాడు. అనంత్ అంబానీ మాట్లాడుతూ.. తన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన తల్లి నీతూ అంబాని నాలుగు నెలలుగా కష్టపడుతూ రోజుకు 18 గంటలు పని చేస్తుందని అన్నాడు. అమ్మపై ప్రేమ చూపిస్తూ ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. జూలై 12న రాధికా మర్చెంట్, అనంత్ అంబానీల విహాహం జరగనుంది.