
Campa Cola: ముఖేష్ అంబానీ అసలైన భారతీయ వ్యాపార సూత్రాలను ఫాలో అవుతున్న బిజినెస్ మెన్. దేశంలోని ప్రజల మైండ్ సెట్ బాగా చదివిన ఆయన కుటుంబం ముందు నుంచి ప్రజలను తన వస్తువులు, సేవల వైపు మళ్లించుకోవటం కోసం ఉపయోగిస్తోంది ఒకటే వ్యూహం. అదే పెనిట్రేటింగ్ స్ట్రాటజీ. మార్కెట్లోకి చవకగా లేదా ఉచితంగా ప్రజలకు తన సేవలను అందించటం ద్వారా మెుదటి నుంచి అంబానీ అనేక వ్యాపారాల్లో లాభాలతో పాటు వేగంగా వ్యాపార అభివృద్ధిని చూస్తున్నారు.
గడచిన కొన్ని త్రైమాసికాలుగా రిలయన్స్ తన రిటైల్ వ్యాపారంలో అనేక స్టోర్లను క్లోజ్ చేస్తూ వస్తోంది. దేశంలో పదుల సంఖ్యలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్లు, రిలయన్స్ రిటైల్ స్టోర్లను మూసివేస్తున్న తరుణంలో మరో విజయాన్ని అంబానీ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సారి ఆయన విజయం శీతల పానీయాల వ్యాపారంలో కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ బెవరేజ్ కంపెనీలైన కోకాకోలా, పెప్సీల ఆధిపత్యం మధ్య అంబానీ తన దేశీయ బ్లాండ్ క్యాపా కోలా ఉత్పత్తులను భారీగా విక్రయిస్తున్నారు.
గడచిన 18 నెలల కాలంలో రూ.వెయ్యి కోట్ల ఆదాయాన్ని క్యాంపా ఉత్పత్తుల విక్రయం ద్వారా నమోదు చేసి పెద్ద సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు అంబానీ. ఈ క్రమంలో అంబానీ విదేశీ బ్రాండ్ల కంటే తక్కువ రేటుకు క్యాంపాను అందుబాటులో ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా విస్తారమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వేగంగా ప్రజల్లోకి తన ఉత్పత్తులను తీసుకెళ్లారు. దేశంలో క్యాంపా కోలా 1970-80ల మధ్య కాలంలో చాలా పాపులర్. అయితే 2022లో దీనిని కొనుగోలు చేసిన రిలయన్స్ తర్వాత దానిని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం చేరువచేసింది.
►ALSO READ | VI Stock: 67% పెరగనున్న వొడఫోన్ ఐడియా స్టాక్.. సిటి గ్రూప్ కొత్త టార్గెట్ ధర ఫిక్స్..
ప్రస్తుతం క్యాంపాకోలాను రిలయన్స్ 200 ఎంఎల్ కు రూ.10 చొప్పున విక్రయిస్తోంది. దీనికి తోడు కంపెనీకి తన సొంతంగా ఉన్న రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ స్టోర్స్, జియో మార్ట్, మెట్రో స్టోర్స్ వంటి వివిధ వ్యాపారాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచింది. అలాగే కంపెనీ రిటైలర్లకు 15 నుంచి 25 శాతం మధ్య మార్జిన్లను అందించటం ప్రత్యర్థులకు గట్టి పోటీని అందిస్తోంది. దీంతో రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి క్యాంపా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడైంది.
ప్రస్తుతం క్యాంపా దేశంలోని అనేక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం వరకు మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఇదే సమయంలో పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల రేట్లను తగ్గించటంతో పాటు కొత్త సైజుల్లో ప్యాకేజీలను కూడా విడుదల చేస్తున్నాయి. అయితే వాటికి ఊపిరాడకుండా చేస్తున్న అంబానీ త్వరలోనే క్యాంపా కోలా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు రూ.500 నుంచి 700 కోట్ల వరకు కొత్త పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు కంపెనీ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. దీంతో అంబానీ మరోసారి ప్రపంచ దిగ్గజ సంస్థలతో పోటీని కొనసాగిస్తున్నారు. పైగా గతవారం టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా కంపెనీ ప్రకటించింది.