బోర్డు మీటింగ్ఫీ మాత్రమే
న్యూఢిల్లీ: ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో చేరిన ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలకు కంపెనీ నుంచి ఎలాంటి జీతమూ ఉండదు. బోర్డు, కమిటీ మీటింగ్‌లకు హాజరైనందుకు ఇచ్చే ఫీ మాత్రమే చెల్లిస్తారు. ఈ మేరకు వాటాదారుల అనుమతి కోరుతూ ఒక ప్రపోజల్‌ను డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. 2020–21 నుంచి చైర్మన్ ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం లేదు. తాజాగా బోర్డులో చేరిన ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలకు సైతం జీతం ఉండదు.
ముకేశ్ అంబానీలాగే సంపాదించే లాభాలపై కమిషన్ పొందుతారు. ఆకాశ్ టెలికం బిజినెస్, ఈషా రిటెయిల్ బిజినెస్, అనంత్ న్యూ ఎనర్జీ బిజినెస్‌ల బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పుడు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముకేశ్ అంబానీ 1977 నుంచి రిలయన్స్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.