రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ముంబైలో అంగరంగా వైభవంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రేటీలతో పాటుగా వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సమక్షంలో అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు.
ఎంగేజ్ మెంట్ సెర్మెనీ అనంతరం అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా, పెద్దకొడుకు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, ఆమె భర్త ఆనంద్ పిరమల్ స్టెప్పులతో అదరగొట్టారు. బాలీవుడ్ క్లాసిక్ “హమ్ అప్కే హై కౌన్” చిత్రం నుంచి ‘వా వాహ్ రామ్‌జీ’ వెర్షన్‌కు చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంత్, రాధికల వివాహం ఈ ఏడాది జరగనుందని సమాచారం.